కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన టింబర్ డిపో!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి చిత్తారమ్మ దేవాలయం సమీపంలోని అంబేద్కర్‌ నగర్‌ బస్తీలో భారీ అగ్నిప్రమాదం (Kukatpally Fire Accident) చోటుచేసుకుంది. హరిజన సేవా సంఘం కాలనీలోని గుడిసెల్లో దోమల నివారణ కోసం పెట్టిన పొగ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న గుడిసెలు కట్టెల డిపోకు (టింబర్ డిపో) వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, స్థానికులు వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ రావడంలో ఆలస్యం జరిగిందని, ఫైరింజన్లలో నీరు సరిపడా లేకపోవడంతో పాటు వాటర్ వర్క్స్ ట్యాంకర్లు రావడం ఆలస్యం కావడంతో మంటలను ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చిందని స్థానికులు ఆరోపించారు. మరోవైపు, ఈ స్థలాన్ని రాజకీయ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బస్తీవాసులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>