కలం, సోన్ : సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామ వై జంక్షన్ వద్ద గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి ఓ రోగిని తీసుకుని అంబులెన్స్ హైదరాబాద్‌కు వెళ్తుండగా, ఆర్మూర్ వైపు నుంచి నిర్మల్‌కు వస్తున్న లారీ కడ్తాల్ వై జంక్షన్ వద్ద అంబులెన్స్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సోన్ గోవర్ధన్‌రెడ్డి, పట్టణ సీఐ సమ్మయ్య, సోన్ ఎస్సై గోపి ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

