కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సుడా చైర్మన్ (SUDA Chairman) కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Narender Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని నరేందర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రైతులను ఆదుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో రమేష్, కార్పొరేటర్లు గాదె రూప శ్రీనివాస్, మేకల వెంకటేష్, నాయకులు కాంరెడ్డి రాంరెడ్డి, బీరం ఆంజనేయులు, కపిల్ మాధవ్, శ్రీధర్ రెడ్డి, రాజి రెడ్డి, వెంకటేష్, సాయిని తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

