దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని.. తమ నేత కేసీఆర్ సీఎంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచేవారని అభిప్రాయపడ్డారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు అయిందని చెప్పారు. ఈ కేసుపై టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును ఇరికించాలని రెండవ సిట్ వేశారని ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఆర్ఎస్పీ ఆరోపించారు. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదని చెప్పారు. ప్రభాకర్ రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) ఛార్జ్‌షీట్‌లో కేసీఆర్ (KCR), కేటీఆర్, హరీశ్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుందని చెప్పారు. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు డిపార్ట్ మెంట్ బలైందని ఫైర్ అయ్యారు.

రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ మండిపడ్డారు. తమ నేత క్రిషాంక్‌పై కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని.. దీనిపై సిట్ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్స్‌ట్రక్షన్ కంపెనీలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు డైరెక్టర్లుగా ఉన్నారని ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దని కోరారు. ఇక తమపై పెట్టిన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

Read Also: ఐపీఎల్ 2026: రియాన్ పరాగ్‌‌పై బీసీసీఐ యాక్షన్ !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>