కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కరీంనగర్ సుడా ఛైర్మన్ (SUDA Chairman) కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. తన ఇంటి నుంచి సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిపై వెళ్లారు. స్లో పాయిజన్ మాదిరి సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం చమురు భారం మోపుతోందన్నారు. మోదీ సర్కార్ మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

