ఎంజీయూలో విద్యార్థి సంఘాల ఆందోళన

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda)లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వైస్ ఛాన్సలర్ తీరును ప్రశ్నిస్తున్న విద్యార్థులపై అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, కొద్ది గంటల ముందు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం కలకలం రేపింది.

నిరాహార దీక్ష దిగి..

దీంతో విద్యార్థి నాయకుడు అనుముల సురేష్ వీసీ ఛాంబర్ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తక్షణమే హాల్ టికెట్లు జారీ చేసి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వర్సిటీ ప్రాంగణంలో పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>