కేటీఆర్ బర్త్‌డే.. యువకుడికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం

కలం, హనుమకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని (KTR Birthday) పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఒకరికి సాయం చేశారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన దరావత్ వినోద్ కుమార్‌కు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కిరాణా స్టోర్ ఏర్పాటు కోసం ఈ సాయం చేశారు. గురువారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా లబ్ధిదారుడికి ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడతాయన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>