Mobile Popup Ad
Mobile Popup Ad

మళ్లీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లు (Stock Market) కుప్పకూలిపోయాయి. భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 1200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ఉంటే 380 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. యుద్ధం ఎఫెక్ట్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం తీవ్ర ప్రభావం చూపించింది. గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్లపై (Stock Market) వరుసగా ఎఫెక్ట్ పడుతూనే ఉంది. దీంతో ఇండియన్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. మొన్న ఒక్క రోజే రూ.12లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది.

దేశంలో గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతుండటం.. ఇరు పక్షాల్లో ఎవరూ తగ్గకపోవడంతో యుద్ధ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై పెరుగుతోంది. హర్మూజ్ జలసంధి నుంచి పూర్తి స్థాయిలో నౌకలు ఇంకా నడవట్లేదు. పైగా గల్ప్‌ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు మొత్తం ధ్వంసం కావడంతో.. గతంలో ఉత్పత్తి చేసిన రేంజ్ లో క్రూడ్ ఆయిల్ ఎగుమతి కావట్లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>