epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

స్టార్​లింక్​ రెసిడెన్షియల్​​ ప్లాన్​ రూ.8,600

కలం, వెబ్​డెస్క్​:  భారత్​లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్లో రెసిడెన్షియల్​ ప్లాన్​ ధరను రూ.8,600గా స్టార్​లింక్ (Starlink)​ నిర్ణయించింది. అయితే, కమర్షియల్ ప్లాన్ల ధరలను, స్పీడ్​ను వెల్లడించలేదు. అలాగే త్వరలోనే తమ సేవలను భారత్​లో ప్రారంభించనున్నట్లు ఎలాన్​ మస్క్​ కంపెనీ స్టార్​లింక్​ ప్రకటించిది. ఈ మేరకు స్టార్​లింక్​ ఇండియా వెబ్​సైట్​ లో వివరాలు పోస్ట్​ చేసింది. దీని ప్రకారం రెసిడెన్షియల్​ సేవలకు నెలవారీ ధర రూ.8,600గా పేర్కొంది. దాంతోపాటు హార్డ్​వేర్​ ఏర్పాటుకు రూ.34వేలు చెల్లించాలి. ఈ ప్లాన్​లో డేటాపై పరిమితి లేదు. అలాగే ఉచితంగా 30 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు పొందచ్చు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో దీనిని రూపొందించినట్లు స్టార్​లింక్​ తెలిపింది. అంటే సబ్​స్క్రిప్షన్​ తీసుకున్న ఎవరైనా సరే సులభంగా డివైజ్​ అమర్చుకోవచ్చు. ఇక, శాటిలైట్​ సేవల గేట్​వే కోసం హైదరాబాద్​, చండీగఢ్​, కోల్​కతా, లక్నో, ముంబై, నోయిడాలో స్టేషన్లు ఏర్పాటుచేస్తోంది. కాగా, మన పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్​, భూటాన్​లో ఇప్పటికే స్టార్​లింక్​ సేవలు అందుతున్నట్లు వెబ్​సైట్​ చూపిస్తోంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు అందుతాయని, 99.9శాతం కచ్చితత్వం ఉంటుందని స్టార్​లింక్​ తెలిపింది. కాగా, స్పీడు వివరాలు అధికారికంగా చెప్పకపోయినప్పటికీ 25ఎంబీపీఎస్​ నుంచి 225ఎంబీపీఎస్​ వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

స్టార్​లింక్​ ఎలా పొందవచ్చంటే..:

స్టార్​లింక్ (Starlink)​ ఇండియా వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి.అందులో ‘గెట్​ స్టార్టెడ్​’ బటన్​ క్లిక్​ చేసి మన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. అనంతరం ప్లాన్​, సబ్​స్క్రిప్షన్​ వివరాలు స్క్రీన్​పై కనిపిస్తాయి. మనకు కావాల్సిన ప్లాన్​ ఎంచుకోవాలి.పేమెంట్​ పూర్తి చేయాలి. ఇక సేవలందుకోవడమే తరువాయి. అయితే, ఇప్పటివరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో స్టార్​లింక్​ సేవలుకు అనుమతి లేదు. దశలవారీగా అన్ని ప్రాంతాల్లోనూ సర్వీసు తీసుకొస్తారు. ప్రస్తుతం తెలంగాణలో సర్వీస్​ లేనట్లు, ఆంధ్రప్రదేశ్​లో విశాఖపట్నం, నెల్లూరులో సేవలున్నట్లు వెబ్​సైట్​ లో కనిపిస్తోంది.

Read Also: ‘వందేమాతరం’ ను కాంగ్రెస్ ముక్కలు చేసింది : మోడీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>