ఉద్యోగులపై స్పైయింగ్.. చైనా ఆధునాతన పద్ధతి

కలం, వెబ్ డెస్క్ : కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో ఎలా పని చేస్తున్నారో అనే ఒక కన్నేసి ఉంచుతారు యజమానులు. పనిలో క్వాలిటీతో పాటు టైమ్ వేస్ట్ కాకుండా ఉండాలని అనుకుంటారు. అలానే, చైనాకు చెందిన ఓ కంపెనీ (Chinese Companies) తమ ఉద్యోగుల కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి అధునాతన పద్ధతులను ఫాలో అవుతోంది. ఆఫీసుల్లో స్మార్ట్ సీట్ కుషన్లను అమర్చి, ఉద్యోగుల హార్ట్ రేట్, శ్వాస, కూర్చునే భంగిమ, ఎంత సేపు కూర్చొన్నారు.. అనే వివరాలన్నీ నమోదు చేస్తున్నారు.

అలాగే, ఉద్యోగులు ఆఫీస్ వై-ఫై ద్వారా ఏమేమీ బ్రౌజింగ్ చేస్తున్నారు? కెమెరాల ద్వారా స్క్రీన్‌లు, చాట్‌లను కూడా మానిటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ట్రాకింగ్ వల్ల ఉద్యోగులు బాత్రూమ్ కు వెళ్లిన సమయం నుంచి బ్రేక్‌ల వ్యవధి వరకు అన్నీ రికార్డ్ అవుతున్నాయి. గతంలో 2021లో హాంగ్‌జౌలోని ఒక టెక్ కంపెనీ ఇలాంటి స్మార్ట్ కుషన్లను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు, ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. చట్టవిరుద్ధమని నిపుణులు హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ మళ్లీ పెరిగిపోతోంది.

చైనా కంపెనీ (Chinese Companies) లో AI, IoT టెక్నాలజీల ద్వారా ఉత్పాదకత పెంచాలనే లక్ష్యంతో ఈ విధమైన టెక్నాలజీని వాడుతున్నారు. కానీ ఇది ఉద్యోగుల ఒత్తిడిని, ఒంటరితనాన్ని పెంచుతోందని, వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పర్యవేక్షణకు వ్యతిరేకంగా ఉద్యోగులు యాంటీ-మానిటరింగ్ గాడ్జెట్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఉపయోగించి ట్రాకింగ్‌ను తప్పించుకుంటున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>