కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టుతోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) అన్నారు. ఇజ్రాయెల్ లో ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ సామాన్య జనాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. తాము మాత్రం జనాలను లక్ష్యంగా చేసుకోకుండా అధ్యక్షుడు, కీలక నేతలు, ఆర్మీ వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెప్పారు.
ఇరాన్ ఖండాంతర క్షిపణి ప్రయోగాలపై నెతన్యాహు (Netanyahu) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇరాన్ ఐరాపాలోకి చొచ్చెకెళ్లగలదని.. కాబట్టి ఆ దేశంతో ప్రపంచానికే ప్రమాదం అని నెతన్యాహు తెలిపారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోందని.. ఈ చర్యను ప్రపంచ దేశాలు ఖండించాలని కోరారు. ఇప్పటికే కొన్ని దేశాలు ముందుకొచ్చాయని.. మిగతా దేశాలు కూడా ఆ మేరకు ముందుకు రావాలని తెలిపారు.

