epaper
Wednesday, February 18, 2026
epaper

ఆర్ఆర్ఆర్‌ను మించి.. రాజమౌళి హాలీవుడ్ ప్లాన్స్, అంతర్జాతీయ స్థాయిలో వారణాసి

కలం, వెబ్ డెస్క్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని హాలీవుడ్ స్థాయిలో విడుదల చేసేందుకు రాజమౌళి పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తాన్ని ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించాలని ఆయన భావిస్తున్నారు.

ఈ సినిమా అంతర్జాతీయ మార్కెటింగ్ కోసం రాజమౌళి (SS Rajamouli)  ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు అగ్రశ్రేణి హాలీవుడ్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపుతుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సినిమా నాన్-థియేట్రికల్ డీల్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరతో చర్చలు జరుపుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ సాధించిన రికార్డులను అధిగమించేలా ఈ సినిమా (Varanasi) బిజినెస్ ఉండబోతోందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Read Also: నయనికకు అల్లు శిరీష్‌ ‘వాలెంటైన్స్ డే’ సర్‌ప్రైజ్.. వీడియో షేర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>