కలం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) సౌతాఫ్రికా జోరు పెంచింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రుటిలో ఓటమి తప్పించుకున్న ఆ జట్టు కివీస్‌తో పోరులో దంచేసింది. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ (Aiden Markram), ఓపెనర్ మార్క్రమ్(86 నాటౌట్; 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చితగ్గొడంతో ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్(48; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. డరైల్ మిచెల్(32; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఫిన్ అలెన్ (31; 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు); జేమ్స్ నీషమ్(23 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు) ఓ మోస్తరు పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సన్ 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. కేశవ్ మహారాజ్, కార్బిన్ బోష్, లుంగి ఎన్గిడి తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో మార్క్రమ్ (Aiden Markram) విజృంభించాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్(20; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. అనంతరం రియాన్ రికెల్టన్ (21)తో కలసి రెండో వికెట్ 40, డెవాల్డ్ బ్రెవిస్‌తో కలసి మూడో వికెట్‌కు 29 పరుగులు జోడించాడు. డేవిడ్ మిల్లర్(24 నాటౌట్)తో కలసి ఆఖరి వరకూ నిలిచి జట్టును గెలిపించాడు. సఫారీ జట్టు 17.1 ఓవర్లలో 178 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, నీషమ్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. మార్కో యాన్సన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Read Also: ద్రవిడ్, కుంబ్లేకు ప్రత్యేక గౌరవం
Follow Us On: Instagram


