కలం, నిజామాబాద్ బ్యూరో: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project ) అన్నదాతల ఆశలను సజీవం చేస్తోంది. ఎల్ నినో భయం దాటి వాతావరణం అనుకూలించడంతో జలాశయం కూడా ఆయకట్టు రైతన్నలను ఆదుకోవడానికి సిద్ధమౌతోంది.. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 80 టీఎంసీలు కాగా ఆదివారం రాత్రి వరకు 1078.80 అడుగులు, 41.907 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది.
ప్రస్తుతం వరద తగ్గిపోయింది. 3217 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే వస్తుంది. తాగు సాగు నీటి అవసరాల కోసం ప్రస్తుతానికి పంపుహౌజ్ లు కాలువల ద్వారా 993 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి వర్షాలు ఉండవని, ఎల్ నినో ప్రభావం వల్ల కరువు తప్పదని అంతా భావించారు. కానీ ఆ పరిస్థితులు దాటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పటికే సగం నిండి ఆశలు పెంచుతోంది.

