ఏనుగొండలో ఘనంగా ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆధ్యాత్మికత ద్వారా మనందరిలో ఐక్యత సాధ్యమవుతుందని, సోదర భావాన్ని పెంచేది భక్తి మార్గం ఒక్కటేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్‌ (Mahabubnagar) లోని ఏనుగొండ అక్షర కాలనీలో ఉన్న శ్రీశ్రీశ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గణపతి, ధ్వజస్తంభం, శివాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి, రామాలయం, పోచమ్మ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవాలయాల నిర్మాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని, ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేసిన కమిటీ సభ్యులు, కాలనీ వాసులను ఆయన అభినందించారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు మాణిక్య ప్రభు, ఉపాధ్యక్షులు కమలాకర్ రాజు, రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి స్వప్న, కోశాధికారి దాసయ్య, కార్యవర్గ సభ్యులు కృష్ణవేణి, మల్లేష్, శ్రీనివాసులు, శివరాములు, ఆంజనేయులు, రాజు మేస్త్రి, విష్ణు, చందు, నరేష్, వెంకటేష్ మేస్త్రి, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>