వరుణ్.. నీ మిస్టరీ హిస్టరీ ఎండ్ అయింది: శ్రీకాంత్

క‌లం, వెబ్ డెస్క్‌: వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరున్ చక్రవర్తి మిస్టరీ హిస్టరీకి ఎండ్ కార్డ్ పడిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడు ఆటతీరుపై శ్రీకాంత్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరుణ్ బౌలింగ్‌లో ఇక ఏమాత్రం మిస్టరీ లేదని, అది కాస్తా హిస్టరీగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 15 పరుగులు పిండుకున్నారని, అక్కడే మ్యాచ్ ముంబై వైపు మొగ్గిందని ఆయన పేర్కొన్నారు. వరుణ్ కేవలం గూగ్లీలపైనే ఆధారపడకుండా, లెగ్ స్పిన్ వేయడం నేర్చుకోవాలని శ్రీకాంత్ సూచించారు. బంతిని బ్యాటర్లకు దూరంగా టర్న్ చేసినప్పుడే ప్రత్యర్థులు భయపడతారని హితవు పలికారు. వరుసగా విఫలమవుతున్న వరుణ్, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూడా భారీగా పరుగులు సమర్పించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రోహిత్ శర్మ 78 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఆటగాళ్లు తమ శైలిని మార్చుకోకపోతే లీగ్ దశలో రాణించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>