Mobile Popup Ad
Mobile Popup Ad

తన ఫామ్‌పై విమర్శలు.. రహానే స్ట్రాంగ్ కౌంటర్..!

క‌లం, వెబ్ డెస్క్‌: తన ఫామ్‌పై వచ్చిన విమర్శలపై కేకేఆర్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) ఘాటుగా స్పందించాడు. విమర్శకులను తాను పట్టించుకోనని, తన పని తాను చేసుకుంటూ పోతానని అన్నారు. ఎప్పుడూ ఎవరో ఒకరు మన గురించి నెగిటివ్‌గా మాట్లాడుకుంటారని, వాటిని పట్టించుకుంటే మనం జీవితంలో ముందుకు వెళ్లలేమంటూ రహానే.. హితవు పలికారు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులతో మెరిసిన ఆయన, తన బ్యాటింగ్ శైలిపై వస్తున్న విమర్శలకు మైదానంలోనే సమాధానం చెప్పారు. తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఇక్కడ లేనని, కేవలం జట్టు కోసం ఆడుతున్నానని స్పష్టం చేశారు.

అయితే, కేకేఆర్ నిర్దేశించిన ఈ భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ సునాయాసంగా ఛేదించారు. రోహిత్ 78 పరుగులు, రికెల్టన్ 81 పరుగులతో చెలరేగడంతో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇన్నింగ్స్ చివర్లో జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల తాము ఆశించిన 240 పరుగులు చేయలేకపోయామని రహానే అభిప్రాయపడ్డారు. బుమ్రా అద్భుతమైన స్పెల్ వల్లే మ్యాచ్ ఫలితం మారిందని ఆయన ఒప్పుకున్నారు. కేకేఆర్ తన తదుపరి పోరులో ఏప్రిల్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>