ఏపీలో విషాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి

కలం, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో విషాద సంఘటన (Tekkali Train Accident) చోటుచేసుకుంది. పట్టాలు దాటుతున్న సమయంలో రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద బాధితులను డమర ప్రాంతానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు.

తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>