హైదరాబాద్ ప్రజలకు TGSRTC గుడ్‌న్యూస్

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్​ ప్రజలకు TGSRTC గుడ్​న్యూస్​ చెప్పింది. హైదరాబాద్‌లో ఆగస్టు 29 నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి వేళల్లో సిటీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఐటీ ఉద్యోగులు, నైట్‌ షిఫ్ట్‌ సిబ్బంది, ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రతి 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>