Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసిన శ్రీహరి రావు

కలం, నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ (Nirmal ) నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు (Srihari Rao) గురువారం మర్యాద పూరకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ తో పాటు మరో అదనపు పోలీస్ స్టేషన్‌ ను ఏర్పాటు చేయాలని ఆయన డీజీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ.. నిర్మల్ పట్టణ అవసరాలను పరిశీలించి త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ తో పాటు మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్రీహరి రావు తెలిపారు.

Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>