తెలంగాణ కేబినెట్ భేటీకి డేట్ ఫిక్స్

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) భేటీకి డేట్ ఫిక్స్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 14న జరగనుంది. స్మార్ట్ రేషను కార్డుల జారీ, కొత్త పింఛన్ల మంజూరు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల తేదీల ఖరారు తదితర పలు అంశాలపై చర్చించనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరపాలన్న ఆనవాయితీలో భాగంగా ఈ సమావేశం జరగబోతుంది. సాధారణంగా సాయంత్రం సమయంలో సచివాలయంలో జరిగే సమావేశం ఈసారి ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనేందుకు మంత్రులు జిల్లాలకు వెళ్లాల్సి ఉన్నందున మధ్యాహ్నం సమయానికి ముగించేలా మార్పు చేసినట్లు సమాచారం.

అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశం..

లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనపై అసెంబ్లీలో చర్చించేలా ఒక రోజు స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాన్ని నిర్వహించే తేదీలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 19న రాత్రి అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ లోపే అసెంబ్లీ సెషన్ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>