కలం, వెబ్ డెస్క్ : ఇండిపెండెన్స్ డే పేరుతో వాట్సప్ లేదా ఎస్ఎమ్ఎస్ల రూపంలో వచ్చే ఉచిత ఆఫర్ల లింకులను ఓపెన్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఆగస్టు 15ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు (Cyber Fruad) ఫ్రీ గిఫ్టులు, క్యాష్ బ్యాక్ వస్తుందంటూ పంపే లింకులను క్లిక్ చేసి వారి వలలో పడొద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్ ను ఓపెన్ చేస్తే వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు లేదా ఓటీపీలు నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. ఏపీకే ఫైల్స్ ఇన్ స్టాల్ కావడం వల్ల మీ ఫోన్ల యాక్సిస్ సైబర్ దొంగల చేతికి వెళ్లిపోతుంది. దీని ద్వారా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
ఫ్రీ ఆఫర్స్, క్యాష్ బ్యాగ్స్ కోసం పేరు, ఫోన్ నంబర్, ఆధార్ వంటి వివరాలను సేకరించి వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఫ్రీ గిఫ్ట్స్, ఆఫర్ ఉన్న లింక్స్ ను క్లిక్ చేయకుండా ఉండడంతో పాటు మిత్రులకు, బంధువులకు ఫార్వర్డ్ చేయకపోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

