Mobile Popup Ad
Mobile Popup Ad

నల్గొండలో బస్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

కలం, నల్లగొండ బ్యూరో: నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ (Nalgonda RTC Driver) వెంకన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ నల్లగొండ బస్ డిపో ఎదుట వెంకన్న ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది.. కిరోసిన్ బాటిల్, అగ్గిపెట్టె లాక్కోవడంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు బస్టాండ్ డిపో వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో డిపో పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. పోలీసులను భారీగా మోహరించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మరికాసేపట్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

Read Also: జబ్బుల గుప్పిట్లో భారత్.. సగం మందికి అనారోగ్య సమస్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>