కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలిస్తున్నారు. హైదరాబాద్లో కన్నుమూసిన సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని తొలుత హనుమకొండలోని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు ఆయనకు నివాళులర్పించారు.
అనంతరం ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని నర్సంపేటకు తరలించనున్నారు. నర్సంపేటలో ప్రజలు, అనుచరుల తుది సందర్శన ముగిసిన తర్వాత, అక్కడి నుండి ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి భౌతికకాయాన్ని తీసుకెళ్తారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లి గ్రామంలో సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక గొప్ప నాయకుడికి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

