పెద్ది మృతి పట్ల రేవంత్, కేసీఆర్ సంతాపం

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర వహించారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..పెద్ది ఆత్మకు శాంతి చేకూరాలని రేవంత్ ప్రార్థించారు.

ఉద్యమ సహచరున్ని కోల్పోయా: కేసీఆర్

పెద్ది మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్ తానొక ఆప్త మిత్రున్ని, ఉద్యమ సహచరున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్ జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలూ, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేశారన్నారు. మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>