వరుస సినిమాలకు నో చెబుతున్న మెగా హీరో!

కలం, వెబ్ డెస్క్: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా కొందరు నటులు కథలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తూ సినిమాలు చేస్తుంటారు. అలాంటి నటులే ప్రేక్షకుల మనసుకు దగ్గరవుతారు. ఈ క్రమంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ’విరూపాక్ష’ లాంటి భారీ విజయం తర్వాత ఆయన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లడం లేదు. కేవలం వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఆయన వద్దకు వచ్చిన దాదాపు డజనుకు పైగా స్క్రిప్ట్‌లను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లోని పలువురు అగ్ర దర్శకులు, ప్రముఖ నిర్మాణ సంస్థలు సంప్రదించినప్పటికీ, కథల్లో కొత్తదనం లేకపోవడంతో ఆయన నో చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన పూర్తి దృష్టిని ‘సంబరాల ఏటి గట్టు’ అనే సినిమాపైనే పెట్టారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు, ఇటీవల ‘క’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకులు సందీప్, సుజిత్‌లతో ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. సంఖ్య కంటే నాణ్యమైన సినిమాలే ముఖ్యమని భావిస్తున్నాడు.  ఈ మెగా హీరో వచ్చే ఏడాది వరకు కొత్త ప్రాజెక్ట్‌లేవీ (Cinema) అనౌన్స్ చేసే ఆలోచనలో లేడని తెలుస్తోంది.

Read Also: యంగ్ హీరోపై అడివి శేష్ విమర్శలు.. పేరు చెప్పకుండానే కామెంట్స్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>