నిర్మల్‌లో సినీ సందడి.. శ్రీలీల, ఐశ్వర్య రాజేష్‌తో అభిమానుల హంగామా

కలం, నిర్మల్: నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలో గురువారం సినీ తారల సందడి నెలకొంది. వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చెన్నై షాపింగ్‌ మాల్‌ నూతన షోరూమ్‌ను గురువారం ప్రముఖ హీరోయిన్‌ శ్రీలీల‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలీల (Sreeleela) మాట్లాడుతూ.. చెన్నై షాపింగ్‌ మాల్‌ షోరూమ్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇప్పటివరకు 35 షోరూమ్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. నిర్మల్‌ పట్టణానికి రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని నిర్మల్‌ ప్రజలు నూతన షోరూమ్‌లో షాపింగ్‌ చేయాలని కోరారు.

చందన బ్రదర్స్‌ బ్రాంచ్‌ ప్రారంభించిన నటి ఐశ్వర్య రాజేష్‌..

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్‌ నూతన బ్రాంచ్‌ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి ఘనంగా ప్రారంభించారు. నూతన షాపింగ్‌ మాల్‌లో సరికొత్త కలెక్షన్స్‌ అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రజలు షాపింగ్‌ చేయాలని కోరారు.

హీరోయిన్లను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం..

నిర్మల్‌లో ఒకేరోజు రెండు ప్రముఖ వస్త్ర షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభం కావడంతో పాటు సినీ హీరోయిన్లు శ్రీలీల (Sreeleela), ఐశ్వర్య రాజేష్‌ హాజరుకావడంతో పట్టణంలో సందడి నెలకొంది. తమ అభిమాన తారలను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో షోరూమ్‌ల పరిసర ప్రాంతాలు జనసందోహంతో కిటకిటలాడాయి.

Also Read : దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>