క్రీడలు, విద్యాభివృద్ధికి పెద్దపీట.. ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ: విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ (MLA Balu Naik ) అన్నారు. యువత, విద్యార్థులు ఆటల్లో రాణించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవరకొండలో ఘనంగా నిర్వహిస్తున్న 70వ ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

దేవరకొండలో క్రీడాభివృద్ధికి త్వరలోనే స్పోర్ట్స్ అకాడమీతో (Devarakonda Sports Academy) పాటు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ క్రీడల్లో గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి, జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, అందులో భాగంగా రూ.9.60 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ అభివృద్ధికి రూ.2.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.

ఈ కళాశాలలో సీఎం రేవంత్ రెడ్డి మామ, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి చదువుకున్నారని, ఈ చారిత్రక నేపథ్యం ఉన్న విద్యాసంస్థను మోడల్ కాలేజీగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం మిర్యాలగూడ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు దేవరకొండలోనే ఈ సేవలు ప్రారంభించడం వల్ల స్థానిక ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ సబ్ కలెక్టర్, ఎస్జీఎఫ్ నిర్వాహకులు, దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, హనుమంతు వెంకటేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు మారుపాకుల సురేష్ గౌడ్, దొండేటి మల్లారెడ్డి, కొర్ర రాంసింగ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>