కలం, సినిమా : హైదరాబాద్ ఫిలింనగర్‌లో (Film Nagar) ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు (Singeetham Srinivasa Rao) ప్రత్యేక ట్రిబ్యూట్ అందించారు. ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల పోస్టర్లు, సన్నివేశాలతో ఒక ప్రత్యేక వాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాల్‌ను ‘సింగ్ గీతం’ మూవీ టీం రూపొందించింది. 94 సంవత్సరాల వయస్సులో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూవీ ‘సింగ్ గీతం’.. జూన్ 11న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో ఆయన సినిమాల జ్ఞాపకాలను ప్రేక్షకులకు గుర్తు చేస్తూ మూవీ టీం వినూత్నంగా ట్రిబ్యూట్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలుగు సినిమా చరిత్రలో సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం వంటి క్లాసిక్ చిత్రాలతో ఆయన ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇదే తరహా ట్రిబ్యూట్ కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆయన సృజనాత్మక దృష్టిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం సినీ వర్గాలలో ఆసక్తి రేపుతోంది. ఈ ట్రిబ్యూట్‌కు సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన లభిస్తుంది.
Read Also: క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన టాలీవుడ్ నటుడు సుప్రీత్!
Follow Us On: X(Twitter)

