Mobile Popup Ad
Mobile Popup Ad

నేపాల్ ఎన్నికలు.. తాత్కాలిక ప్ర‌ధాని కీలక వ్యాఖ్యలు

క‌లం, వెబ్ డెస్క్‌: నేపాల్‌లో ఎన్నికల (Nepal Election) పోలింగ్ గురువారం ఉద‌యం ప్రారంభమైంది. గత ఏడాది జెన్‌జెడ్‌ యువత నేతృత్వంలో జరిగిన ఆందోళనలతో కేపీ శర్మా ఓలి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి సాధారణ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నిక‌లు ఎంతో ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. అనంతరం బ్యాలెట్ పెట్టెలను సేకరించిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో 1.89 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ ద్వారా ఎన్నుకునే 165 స్థానాలకు 3,406 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీలా కార్కి (Sushila Karki) ఎన్నికల్లో ఓటు వేయడానికి కాఠ్మాండులోని ధపాసి పోలింగ్ సెంటర్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతు త‌న డ్యూటీ అయ‌యిపోయింద‌ని చెప్పారు. మీడియా మ‌రిన్ని ప్ర‌శ్న‌లు వేసేందుకు ప్ర‌య‌త్నించగా ఆమె స‌మాధానం చెప్ప‌కుండానే వెళ్లిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>