పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : పల్నాడు (Palnadu) జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఘటనపై అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలు వేగంగా పూర్తి చేయాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు.

పరిహారం మొత్తాన్ని వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఘటనపై రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖ అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పడవ ప్రమాదాలు పునరావృతం కాకుండా కృష్ణా నదిలో ప్రయాణించే పడవల భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్‌ డా. కృతికా శుక్లా వెంటనే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెక్కులను అందజేశారు.

Read Also: మేం అధికారంలోకి వస్తే డీఎస్సీ స్కామ్‌పై చర్యలు తప్పవు : సజ్జల

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>