Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్ ‘షీ టీమ్స్’ పనితీరుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.. అభినందించిన ఎస్పీ

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మొదటి స్థానం సాధించిన షీ టీమ్స్ (SHE Teams) సభ్యులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Janaki Sharmila) అభినందించారు. జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌ను శనివారం ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం, ఫిర్యాదులపై తక్షణ స్పందనతో సమర్థవంతంగా విధులు నిర్వహించడం వల్లే రాష్ట్ర స్థాయిలో ఈ ఘనత సాధించారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరింత కట్టుదిట్టంగా విధులు నిర్వహించి జిల్లా పోలీసు శాఖకు మరిన్ని విజయాలు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొంటూ షీ టీమ్ ఇంచార్జి ఎస్సై నర్సయ్యతో పాటు సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>