Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు నిర్మ‌ల్‌లో ‘స‌ర్‌’ అవగాహన సదస్సు: కూచాడి శ్రీహరి రావు

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) శ‌నివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ సదస్సు ద్వారా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, సవరణలపై పార్టీ శ్రేణులకు స్పష్టత కల్పించనున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>