కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో (South Central Railway) భారీ మార్పులు రాబోతున్నాయి. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అవుతుండటంతో జూన్ ఒకటో తేదీ నుంచి డివిజన్లు మారబోతున్నాయి. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న కొత్త జోన్ పరిధిలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు ఉండబోతున్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లతో 3,589 కిలోమీటర్ల పరిధితో దక్షిణ మధ్య రైల్వే కార్యకలాపాలు కొనసాగించబోతుంది. ఇప్పటికే రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. జూన్ ఒకటో తేదీ నుంచి ఆపరేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి.
కాజీపేట డివిజన్ అయ్యేదెన్నడు..?
దక్షిణ మధ్య రైల్వేలో (South Central Railway) ఇక నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉండబోతున్నాయి. అయితే, ఎప్పటి నుంచి డిమాండ్ ఉన్న కాజీపేట డివిజన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. డివిజన్ ఏర్పాటు ఆలోచన రైల్వే బోర్డుకు లేదని పార్లమెంటులోనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అయినా, దీనిపై పలుమార్లు వినతులు వెళ్తూనే ఉన్నాయి. కాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్‌లో ఇటు విజయవాడ రూట్, అటు బల్లార్షా రూట్‌ను విలీనం చేయొచ్చని మజ్దూర్ సంఘాల నేతలు కోరుతున్నారు.
Read Also: మీడియా సంస్థలపై బండి సంజయ్ పరువు నష్టం దావా
Follow Us On: Instagram

