కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్ కూడా హాజరు కాబోతున్నారు. పుస్తకం ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి రాగా.. ఈ రోజు అధికారికంగా ఆవిష్కరించబోతున్నారు.
ఈ సందర్భంగా సోనియా సహా పలువురు నేతలు పుస్తకంపై ప్రసంగించబోతుండటంతో ఆసక్తి నెలకొంది. పుస్తకం విడుదల కాగానే.. అందులో సోనియా ప్రస్తావించిన పలు అంశాలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. ఎమర్జెన్సీ, సిక్కు అల్లర్లు, యూపీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం వంటి వాటిపై విమర్శలు గుప్పిస్తోంది. వీటికి సోనియా గాంధీ సమాధానం చెబుతారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : డిసెంబర్ ఫస్ట్ వీక్లో పార్లమెంట్.. తెరపైకి కీలక బిల్లులు!
Follow Us On: X(Twitter)

