కలం, వెబ్‌డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మోలోడీ ట్రెండ్ (Melody Trend)పై బాలీవుడ్ జంట సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) వెరైటీగా స్పందించారు. ఈ ఇంటర్నెట్ ట్రెండ్‌ను ఉపయోగించుకొని వారు క్రియేట్ చేసిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో జహీర్ సోనాక్షిపై తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఒక మెలోడీ చాక్లెట్‌ను తీసి మెలోడీ ఖావో.. ఖుద్ జాన్ జావో అంటూ హిందీలో డైలాగ్ కొట్టి ఆ చాక్లెట్‌ను సోనాక్షి భుజంపై ఉంచాడు. జహీర్ అక్కడి నుంచి వెళ్లిపోగానే సోనాక్షి ఆ చాక్లెట్‌ను తీసి జహీర్‌పై విసిరేసింది. ఆమె ఫన్నీగానే విసిరేసినా నెటిజన్లు సోనాక్షి చేసిన పనికి పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఇక ఈ మెలోడీ ట్రెండ్ వెనుక ఆసక్తికర కథ ఉంది. రోమ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి మోలీడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఒక వీడియోలో మెలోని మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మా కోసం ఒక మంచి చాక్లెట్‌ను బహుమతిగా తెచ్చారని నవ్వుకుంటూ చెప్పారు. వెంటనే మోదీ మెలోడీ అంటూ బదులిచ్చారు. దీంతో ఇద్దరు నేతలు నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే మెలోడీలో మెలోని, మోదీల పేర్లు కూడా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇది నెట్టింట వైరల్‌గా మారడంతో మీమ్స్, ఫన్నీ వీడియోలు దీనిపై క్రియేట్ అయ్యాయి. ఇక సెలబ్రెటీలు కూడా ఇలా మెలోడీ ట్రెండ్‌ను వాడుకుంటూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

