తూప్రాన్ సమీపంలో భారీ ఫైర్ యాక్సిడెంట్

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ (Toopran) సమీపంలో నాగ్‌పూర్–హైదరాబాద్ జాతీయ రహదారి NH44పై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు, కంటైనర్‌లో తరలిస్తున్న 8 మారుతి కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనదారులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిప్రమాదం కారణంగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: బండి భగీరథ్‌ ఎపిసోడ్‌పై సీఎం సంచలన రియాక్షన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>