విధుల్లో నిర్లక్ష్యం.. సోన్ గ్రామ కార్యదర్శిపై సర్పంచ్ ఫిర్యాదు

కలం, సోన్ : సోన్ (Soan) మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి నగేష్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని గ్రామ సర్పంచ్ వనజ మంగళవారం ఎంపీడీవో రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత సెప్టెంబర్ 23 నుంచి ఇప్పటివరకు గ్రామ పంచాయతీ హాజరు రిజిస్టర్‌లో కార్యదర్శి సంతకాలు లేవని పేర్కొన్నారు.

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో వివరించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించిన సర్పంచ్.. కార్యదర్శి విధులకు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>