కలం, వెబ్ డెస్క్: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ వివరాల ప్రకారం గురువారం హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు (Gold Prices Today) ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,800కు చేరింది. బుధవారంతో పోలిస్తే రూ.2,180 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,150గా నమోదైంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,000 తగ్గింది. విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్, తిరుపతి, కర్నూలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కొంత ఊరట లభించింది.
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.100 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.1,99,900గా ఉంది. బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనుగోలుదారులపై ప్రభావం చూపనున్నాయి.

