ఎన్విడియా సీఈఓపై మరో ఆరోపణ..టెక్ ప్రపంచంలో కలకలం!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ, సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ (Nvidia CEO Jensen Huang) మరోసారి వివాహేతర సంబంధం ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. కంపెనీ హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.

గతంలో చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఒక మహిళతో తనకు సంబంధం ఉన్నట్లు హువాంగ్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన కంపెనీలో పనిచేస్తున్న 48 ఏళ్ల కింబర్లీ పావెల్‌తో ఆయన సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు రావడం టెక్ వర్గాల్లో కలకలం రేపుతోంది. మార్చిలో జరిగిన ఎన్విడియా సమావేశం సందర్భంగా కాలిఫోర్నియాలోని శాన్‌హోసే హోటల్‌లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలు వీడియోలో రికార్డయినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో హువాంగ్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఎన్విడియా బోర్డు అత్యవసరంగా సమావేశం కానున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మరోవైపు ఈ వివాదం ప్రభావంతో ఎన్విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>