కలం, జోగులాంబ గద్వాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలు, ఒప్పంద రాజకీయాలు, దుష్పరిపాలన కారణంగా తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ (BJP) జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధ రెడ్డి (Snigdha Reddy) విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కేవలం బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ సర్కార్తోనే సాధ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
మంగళవారం జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కేటీ దొడ్డి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీపాద రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి స్నిగ్ధ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె (Snigdha Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో కమీషన్లు చెల్లించకపోతే కాంట్రాక్టర్ల బిల్లులు కూడా రాని దుస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాగుతున్నాయని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు, జూటా మాటలు చెప్పేందుకు సిద్ధమవుతోందని, ప్రజలు ఆ మాయమాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న SIR ప్రక్రియను పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా తీసుకుని, చురుగ్గా పాల్గొనాలని కోరారు. తెలంగాణ ప్రజలకు పారదర్శకమైన, అభివృద్ధి కేంద్రిత, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందించే ఏకైక ప్రత్యామ్నామం బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా BJYM అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, కౌన్సిలర్ శాలన్న, ఉపసర్పంచ్ ఎర్రభీం రెడ్డి, కేటీ దొడ్డి మండల సీనియర్ నాయకులు యర్సన్ దొడ్డి హనుమంతు, కేటీ దొడ్డి అశోక్, రఘు, దేవేందర్ రెడ్డి, ఉమిత్యాల కర్రెప్ప, పాగుంట, సర్పంచ్ అంజనప్ప, ఉప సర్పంచ్ నర్సిరెడ్డి, కృష్ణకాంత్, కొండన్న, అంపిరెడ్డి, కుచినెర్ల నరసింహులు, రంగాపురం కృష్ణ, గోవిందు, శంకర్ నాయక్, వాచ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఢిల్లీలో హైటెన్షన్.. మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ మెరుపు ధర్నా
Follow Us On : WhatsApp

