epaper
Sunday, February 22, 2026
epaper

వరల్డ్ క్రికెట్‌ను డామినేట్ చేయడమే లక్ష్యం: స్మృతి మంధాన

కలం, స్పోర్ట్స్: “ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించడమే భారత జట్టు లక్ష్యం.. ప్రత్యర్థి ఎవరైనా, ఎక్కడ ఆడినా గెలవడమే మా తదుపరి లక్ష్యం” అని టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) స్పష్టం చేశారు. శనివారం అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాపై 2-1తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న అనంతరం ఆమె జట్టు భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. గతంలో ఎవరిని ఓడించామనే విషయాలను పక్కన పెట్టి, నిలకడగా రాణించడంపైనే తాము దృష్టి పెట్టామని మంధాన పేర్కొన్నారు. 2025లో వన్డే ప్రపంచకప్ సాధించిన భారత జట్టు, ఇప్పుడు పరివర్తన దిశగా సాగుతోందని చెప్పారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనున్న నేపథ్యంలో, వరుసగా రెండో మెగా టైటిల్‌ను ముద్దాడాలని జట్టు పట్టుదలతో ఉందన్నారు. గత ఏడాది వన్డే క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన తాము, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ తుది జట్టును (Best XI) సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు.

ఈ ప్రక్రియలో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఆటగాళ్లకు ఎంతగానో ఉపయోగపడిందని ఆమె వివరించారు. ఈ సిరీస్‌లో 129 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన మంధాన (Smriti Mandhana), నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో 82 పరుగులతో కీలక పాత్ర పోషించారు. తనకు వన్డే, టెస్ట్ క్రికెట్ సహజంగా అబ్బుతాయని, అయితే టీ20 ఫార్మాట్‌లో మాత్రం నిరంతరం కష్టపడుతూ ఆటలో ముందంజలో ఉండాల్సి వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ జరగనున్న తరుణంలో ఇంగ్లాండ్ వంటి విదేశీ గడ్డపై సిరీస్ విజయంతో ఏడాదిని ప్రారంభించడం జట్టుకు సానుకూల అంశమని మంధాన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన ఈ విజయ స్ఫూర్తితో రాబోయే ఐసీసీ టోర్నీల్లోనూ ఇదే ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భారత మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: అభిషేక్‌పైనే అందరి చూపు.. సీనియర్ల సూచనలు ఫలిస్తాయా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>