Mobile Popup Ad
Mobile Popup Ad

ఉత్సాహాభరితంగా “స్లో బైక్ రేసింగ్” పోటీలు

కలం, జోగులాంబ గద్వాల: ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం ​కేటి దొడ్డి మండలం కొండాపురం (Kondapuram) గ్రామంలో యువతలో రోడ్డు భద్రత, వాహన నియంత్రణపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా యువత ఆధ్వర్యంలో “స్లో బైక్ రేసింగ్ (Slow Bike Racing)” పోటీలను అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించారు. ​ఈ పోటీలలో సాధారణ రేసింగ్‌కు భిన్నంగా ఎవరు కింద కాలు పెట్టకుండా, బైక్ ఇంజన్ ఆపకుండా, అత్యంత నెమ్మదిగా గమ్యస్థానాన్ని చేరుకుంటారనే నిబంధనను విధించారు.

ఈ వినూత్న పోటీలో పాల్గొనేందుకు స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బైక్‌పై పట్టు, శారీరక సమతుల్యత, మానసిక ఏకాగ్రతను పరీక్షించేలా సాగిన ఈ పోటీలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.

​ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. “నేటి యువత వేగంగా బైక్‌లు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వేగం కంటే వాహనంపై నియంత్రణ, ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో తెలియజెప్పడానికే ఈ స్లో బైక్ రేసింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. యువత రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ యువత పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>