ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో సంచలనాలు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) దర్యాప్తు చివరి దశకు వచ్చిందని, ఎన్నో సంచలన విషయాలున్నాయని.. త్వరలోనే అవి బయటకొస్తాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. కేంద్రం తన ఫోన్ ట్యాప్ చేసుకున్నా వచ్చిన ఇబ్బందేం లేదన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోదీకి సబ్ సర్వెంట్‌గా మారిపోయారని విమర్శించారు. కల్వకుంట్ల కవిత ఇంటిపై డ్రోన్లు ఎగరేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. కవిత, బీఆర్ఎస్ మధ్య వివాదం జోలికి తాము వెళ్లదల్చుకోలేమన్నారు. ఆ గొడవను వారే పరిష్కరించుకోవాలని సూచించారు. భారత్ సమ్మిట్ ప్రోగ్రాంను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

త్వరలోనే ముంబైకి..

2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ (CM Revanth Reddy) పేర్కొన్నారు. త్వరలోనే పెట్టుబడుల కోసం ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో కూడా ప్రచారం చేపట్టబోతున్నామని వివరించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు తెలంగాణపై బాధ్యత లేదన్నారు. ఎల్ నినోపై అఖిలపక్ష సమావేశానికి కూడా వారు రాలేదని మండిపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన కర్టెన్ రైజింగ్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రతిష్ఠను వారు ఎప్పటికీ తగ్గించలేదని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు.

Also Read : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అక్టోబర్‌గా దీప్తి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>