ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అక్టోబర్‌గా దీప్తి

క‌లం, స్పోర్ట్స్: భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) అక్టోబర్ 2026 నెలకు గాను ‘ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును గెలుచుకున్నారు. జింబాబ్వేతో జరిగిన హోమ్ సిరీస్‌లో ఆమె బ్యాట్, బాల్‌తో అద్భుతంగా రాణించారు. జింబాబ్వేపై భారత్ ఆరు మ్యాచ్‌లు గెలవడంలో దీప్తి ప్రధాన పాత్ర పోషించారు. తొలి టీ20లో 49 పరుగులు చేసి జట్టును ఆదుకోవడంతో పాటు, సిరీస్‌లో రెండు వికెట్లు తీశారు.

వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు, రెండో మ్యాచ్‌లో సెంచరీతో పాటు మూడు వికెట్లు పడగొట్టారు. ఈ టూర్‌లో ఆమె మొత్తం 155 పరుగులు చేసి 7 వికెట్లు సాధించారు. ఈ గుర్తింపు దక్కడంపై దీప్తి (Deepti Sharma) ఆనందం వ్యక్తం చేశారు. సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానుల సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. జట్టు విజయంలో భాగమైన సెంచరీ చాలా ప్రత్యేకమని, ఈ అవార్డును ప్రపంచవ్యాప్త అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Also Read : ఇసయ్యా అరుమై నాయగంకు అర్జున అవార్డ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>