గణేష్ మండపాల్లో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు

కలం, నిర్మల్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల(Ganesh Navaratri Celebrations) సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ గణేష్ మండపాలను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) గురువారం సందర్శించారు. ఆయా మండపాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న మండపాల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>