కలం, నిజామాబాద్ బ్యూరో: ఆగస్టు 26న నిజామాబాద్ లో టీఆర్ఎస్ (TRS) పాంచజన్య సంకల్ప సభ జరగబోతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో ఆగస్టు 26న మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభకు సంబంధించి నిజామాబాద్ లో నిర్వహించేందుకు పార్టీ చీఫ్ కవిత నిర్ణయం తీసుకున్నారు. సభ పర్యవేక్షకులుగా టీఆర్ఎస్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీ డాక్టర్ రఘును కల్వకుంట్ల కవిత నియమించారు.

