కలం, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy) సిట్ విచారణకు హాజరయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధుసూదన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు గుర్తించిన సిట్ మధుసూదన్ రెడ్డికి మంగళవారం నోటీసులు జారీచేసింది. బుధవారం పేట్ బషీరాబాగ్ సిట్ కార్యాలయానికి రావాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. దీంతో మధుసూదన్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సంధర్భంగా మధుసూదన్ స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. అనంతరం మధుసూదన్ మీడియాతో మాట్లాడారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ గురైందని తెలిపారు.విచారణలో భాగంగా సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నెరమని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు.

