Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. డీసీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ సైబరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి డీసీపీ రిత్ రాజ్ (DCP Riti Raj)  ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసు విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. భగీరథ్ వ్యవహారం గత మూడు రోజులుగా చర్చనీయాంశంగా మారగా.. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయొద్దని ఆదేశించడంతో, వెంటనే సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నేరం రుజువైతే ఇబ్బందులే..

బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. తండ్రి కేంద్ర హోం శాఖ మంత్రి కావడంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. పోక్సో కేసు కావడంతో నేరం రుజువైతే.. చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. రాజకీయంగా కూడా బండి సంజయ్‌కి తలనొప్పులు తప్పవని విశ్లేషిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>