కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన భారీ అక్రమాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ (SIT)ను ఏర్పాటు చేసింది. బీసీసీఐ నుంచి అందిన నిధుల దుర్వినియోగం, ఇతర అవకతవకలకు సంబంధించి గతంలో నమోదైన కేసులో పాటు తాజా కేసులపై కూడా విచారణ జరపాల్సిందిగా సీఐడీ చీఫ్ చారు సిన్హా ఆదేశించారు. ఇప్పటికే ఈ అక్రమాలకు సంబంధించి హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులను సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం నమోదైన నాలుగు కేసులను సిట్‌కు బదిలీ చేశారు. సిట్ బృందం లోతైన దర్యాప్తు జరిపి అసలు నిధుల దుర్వినియోగం వెనుక సూత్రధారులు ఎవరన్న దానిపై వివరాలు వెలికితీయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో మరిన్ని కీలక కేసులపైనా చారు సిన్హా స్పందించారు. ఈ ఫార్ములా రేసు కేసు, అక్రమ మైనింగ్, బెట్టింగ్ యాప్స్ కేసులు విచారణ వేగవంతం అవుతున్నాయని తెలిపారు. సెలబ్రెటీలు మరోసారి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.

